మంత్రి శంకరన్న కొత్త నిరసన, కింద కూర్చుని విధులు

శంకరరావు ఇటీవల ఛాంబర్ మారారు. తనకు తగిన ఫర్నీచర్ ఇవ్వాలని కోరుతూ ఆయన సాధారణ పరిపాలనా శాఖ (జిఎడి)కి లేఖ రాశారు. అయితే, ఇప్పటి వరకు ఫర్నీచర్ రాలేదు. దీంతో ఆయన ఛాంబర్‌లో కింద కార్పెట్ పరిచి సమీక్షా సమావేశం నిర్వహించారు. శంకరరావు ఎప్పటికప్పుడు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన నేరుగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications