కిరణ్ కుమార్ రెడ్డి పనితీరుపై సోనియా గాంధీ ఆరా

ఇక్కడి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సోనియాను శైలజానాథ్ గురువారం కలుసుకొని, దాదాపు 9 నిమిషాలు మాట్లాడారు. రాష్ట్రంలో పరిణామాలు ఎలా ఉన్నాయని శైలజానాథ్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కిరణ్ ప్రభుత్వం సాఫీగా నడుస్తోందని, శాంతిభద్రతలు మెరుగయ్యాయని, అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం ప్రవేశపెట్టారని సోనియాకు ఆయన వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై ఒక రహస్య నివేదికను ఆయన సోనియాకు అందించినట్లు తెలిసింది. ఎస్సీల వర్గీకరణ కూడా అవసరమని సూచించారు.












Click it and Unblock the Notifications