హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శాస్త్రవేత్తను చంపిన వాచ్‌మన్, దర్యాప్తులో వెల్లడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ప్రముఖ శాస్త్రవేత్త నారాయణ రెడ్డిని వాచ్‌మన్ చంపినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. గురువారం రాత్రి నారాయణ రెడ్డి అనే శాస్త్రవేత్తను హైదరాబాదులో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆయనను వాచ్‌మన్ హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. తన మిత్రులతో కలిసి వాచ్‌మన్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తనకు ప్రత్యేకమైన గది ఇవ్వకపోవడంతో కక్ష కట్టిన వాచ్‌మన్ ఈ హత్యకు ఒడిగట్టినట్లు చెబుతున్నారు. వ్యవసాయ పరిశోధన యాజమాన్య జాతీయ అకాడమీలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న నారాయణ రెడ్డిని గత రాత్రి గొంతు కోసి హత్య చేశారు.

హైదరాబాదులోని సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గల కర్మన్‌ఘాట్‌లో ఆ హత్య జరిగింది. నారాయణ రెడ్డి ఆర్‌కె పురంలోని వాసవి కాలనీలో నివాసం ఉంటున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నారాయణ రెడ్డికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. బెంగళూర్‌లో ఉంటున్న తన కూతురు కోసం నారాయణ రెడ్డి మైత్రీపురంలో ఇల్లు నిర్మిస్తును్నాడు. వాచ్‌మన్ సత్యనారాయణ దాన్ని పరిశీలించడానికి అక్కడికి గురువారం వెళ్లాడు. ఆ తర్వాత నారాయణ రెడ్డి అక్కడికి వెళ్లాడు. అక్కడే అతనిపై దాడి హత్య చేశారు.

English summary
A senior scientist, who was working at the National Academy for Agricultural Research Management, was brutally murdered on Thursday evening by unidentified persons who slit his throat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X