కిరణ్ రాజకీయం: ఓడిన మంత్రి ఆనం, గెలిచిన అధికారి

పదేళ్లకు మించి ఏ అధికారి కూడా ఒకే శాఖలో ఉండకూడదని విధించిన నిబంధనను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కెసిరెడ్డి కోసం సడలించారని ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో గానీ, మంత్రులు కార్యాలయాల్లో గానీ ఓ ఉద్యోగి కూడా పదేళ్లకు మించి ఉండకూడదనే నిబంధనను ముఖ్యమంత్రి విధించారు. అయితే, కెసి రెడ్డి చలువ వల్ల రమణమూర్తికి మాత్రం ఆ నిబంధనను సడలించారని ఆ పత్రిక రాసింది. ఆయన మండలిలో అదనపు ప్రైవేట్ కార్యదర్సిగా కొనసాగడానికి వీలు కల్పించినట్లు తెలిపింది.
ఆ పత్రిక కథనం ప్రకారం - చాలా కాలంగా తనకు తెలిసిన అధికారిని తన కార్యాలయంలో పెట్టుకోవడానికి మాత్రం ఆనం రామనారాయణ రెడ్డికి సడలింపు లభించలేదు. ఆయన సర్వీసు పదేళ్లు మించిందనే ఉద్దేశంతో రామనారాయణ రెడ్డి విజ్ఞప్తిని ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. దీంతో ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications