దక్షిణ కోస్తాకు, తమిళనాడులకు తుఫాను ముప్పు

Cyclone
హైదరాబాద్: రాష్ట్రంలోని దక్షిణాంధ్రకు, తమిళనాడుకు తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల 30వ తేదీ నాటికి తుఫాను తాకిడి ఉంటుందని వాతావరణ పరిశోధనా కార్యాలయం చెబుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి థేన్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 30వ తేదీన కడలూరు, నెల్లూరు మధ్య అది తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో రేపట్నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయి.

తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో వచ్చిన భారీ అలల వల్ల కోస్తా తీరంలోని 200 పడవలు దెబ్బ తిన్నాయి. తమిళనాడు ఉత్తర కోస్తా తీరంలో, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఈ నెల 28వ తేదీ నుంచి వర్షాలు పడే అవకాశం ఉంది. మంగళవారం రాత్రి నుంచే అవి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+