జీవించి, ఇండియా కోసం మరణిస్తా: అన్నా హజారే

ప్రజల మద్దతు వల్లనే రామ్ లీలా మైదాన్‌లో 12 రోజులు దీక్ష చేయగలిగానని ఆయన చెప్పారు. లోక్‌పాల్ బిల్లును నీరు గార్చడం అన్నా జట్టును మోసం చేయడం కాదని, ప్రజలను మోసం చేయడమని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఏదో ఒక రోజు ప్రజలు ఎగిసిపడి ప్రభుత్వాన్ని శిక్షిస్తారని ఆయన అన్నారు. ప్రజా పార్లమెంటు ఢిల్లీలోని పార్లమెంటు కన్నా పెద్దదని ఆయన అన్నారు. తమ ఓట్ల ద్వారా ప్రజలు ప్రభుత్వాన్ని శిక్షిస్తారని ఆయన అన్నారు. తన శరీర ఉష్ణోగ్రతపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, అయినా దీక్ష కొనసాగిస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications