వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వర్గం ఎంపీకి, కోమటిరెడ్డికి కాంగ్రెసు నోటీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Komatireddy Venkat Reddy-Mekapati Rajagopal Reddy
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం బుధవారం నోటీసులు జారీ చేసింది. లోక్‌పాల్‌కు ఎన్నికల కమిషన్‌లాగా రాజ్యాంగ బద్ధత కల్పించాలన్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రతిపాదనకు లోకసభలో ఓటింగ్ జరుగుతున్న సమయంలో సుమారు ఇరవై ఐదు మంది ఎంపీలు గైర్హాజరైన విషయం తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధిష్టానం ఎంపీలందరికీ నోటీసులు జారీ చేసింది.

అందులో మన రాష్ట్రానికి చెందిన మేకపాటి, కోమటిరెడ్డి ఉన్నారు. తన గైర్హాజరీపై కోమటిరెడ్డి ఇప్పటికే పవర్ కుమార్ బన్సాల్‌కు వివరణ ఇచ్చుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను హాజరుకాలేదని ఆయన చెప్పారు. ఇటీవల వారి కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మేకపాటి తాను రాజీనామా చేశాక విప్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నిస్తున్నారు.

English summary
Congress High Command issued notices to YS Jaganmohan Reddy camp MP Mekapati and Komatireddy Rajagopal Reddy for not attend to loksabha at voting time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X