దీక్షకు ముందే మోత్కుపల్లి అరెస్ట్, గన్‌పార్క్‌వద్ద టెన్షన్

Mothukupally Narasimhulu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులును పోలీసులు బుధవారం దీక్షకు ముందే అరెస్టు చేశారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ వైఖరికి వ్యతిరేకంగా తాను గన్ పార్కు వద్ద దీక్ష చేస్తానని మోత్కుపల్లి ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఆయన గన్ పార్కుకు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. భారీగా పోలీసులను మోహరించారు. మోత్కుపల్లి వచ్చీ రాగానే పోలీసులు అతనిని అరెస్టు చేశారు. దీంతో మోత్కుపల్లి దీక్ష కూడా ప్రారంభించలేదు. అరెస్టు సమయంలో మోత్కుపల్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పలువురు టిడిపి నేతలను కూడా అరెస్టు చేశారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మోత్కుపల్లి మద్దతుగా వచ్చిన ఎర్రబెల్లి దయాకర రావును కూడా అరెస్ట్ చేశారు.

కాగా అంతకుముందు గన్ పార్కు వద్దకు చేరుకున్న టిడిపి నేతలు కెసిఆర్, కోదండరామ్‌పై విరుచుకు పడ్డారు. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా లేదని, ఆ విషయాన్ని పార్టీ చీఫ్ చంద్రబాబు కూడా నిన్నటి కరీంనగర్ యాత్రలో చెప్పారన్నారు. తెలంగాణపై కెసిఆర్‌కు విశ్వసనీయత ఉంటే వెళ్లి సోనియా గాంధీ కాళ్లు పట్టుకోవాలని ధ్వజమెత్తారు. కెసిఆర్ ఊసరవెల్లి అని, కోదండరామ్ ఆయన తొత్తు అని విమర్శించారు. తెలంగాణపై ప్రజలకు జవాబు చెప్పాల్సింది కెసిఆరే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+