వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ సీటు నాదే: పురంధేశ్వరికి టిఎస్ఆర్ జవాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

T Subbirami Reddy
విశాఖపట్నం: విశాఖపట్నం పార్లమెంట్ స్థానం తనదేనని రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ టి.సుబ్బిరామిరెడ్డి స్పష్టం చేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలు(రాజ్యసభ సభ్యులు) లోక్‌సభకు పోటీ చేయరాదని అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం మేరకే తాను పోటీ చేయలేదని, ఈసారి ఈ స్థానం తనదేనని ఆయన వివరణ ఇచ్చారు. కేంద్రమంత్రి విశాఖ సిటింగ్ ఎంపీ పురందేశ్వరి మరో స్థానం చూసుకోవాలని ఆయన సూచించారు. మంగళవారం రాత్రి ఆయన ఓ ప్రముఖ దినపత్రిక ప్రతినిధితో మాట్లాడారు. ముప్ఫయ్యేళ్లుగా విశాఖ ప్రజలతో తనకు అనుబంధం ఉందని, తాను పోటీ చేస్తే గెలిపించడానికి వారు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని సుబ్బిరామిరెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి పురందేశ్వరితో తనకు ఎటువంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆమె మేలుకోరి విశాఖతోపాటు మరో స్థానాన్ని కూడా ముందుగానే ఎంపిక చేసుకోవాలని సూచించానన్నారు. సిట్టింగ్ ఎంపీగా ఆమె మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేయాలని కోరుకోవడంలో తప్పేమీ లేదన్నారు. విశాఖ నుంచి పోటీ చేయడమే తన తొలి ప్రాధాన్యమని చెప్పారు.

అయితే, అధిష్ఠానానికి ఇబ్బంది ఎదురుకాకుండా విశాఖతోపాటు నరసరావుపేట, నెల్లూ రు, ఒంగోలు స్థానాల్లో ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. టికెట్ల కేటాయింపు సమయంలో ఒకే స్థానం కోసం పట్టుబడితే అధిష్ఠానంతోపాటు తమకు ఇబ్బందులు తప్పవన్నారు. విశాఖలో పురందేశ్వరికి పూర్తిస్థాయి బలం లేదని, అందువల్ల ఆఖరి నిమిషంలో ఆమె ఇబ్బందులుపడే అవకాశం ఉందన్నారు. తాను ఇక్కడే పోటీ చేయాలన్న పట్టుదలతో ఇటువంటి ప్రస్తావన తేవడం లేదని, పురందేశ్వరి అంటే తనకు అత్యంత అభిమానమని ఆయన అన్నారు. తాను పోటీ చేయనంటేనే విశాఖ ప్రజలు పురందేశ్వరిని ఆమోదిస్తారు తప్ప, తనను కాదని ఆమె పోటీ చేయడం సరికాదని సుబ్బిరామిరెడ్డి అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో అధిష్ఠానం సర్వే జరిపించి ఎవరు పోటీ చేయాలన్న అంశాన్ని నిర్ణయిస్తుందన్నారు. టికెట్ కేటాయించే ముందు ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటుందన్నారు.

తనలాగే పురందేశ్వరికూడా మరికొన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అధిష్ఠానానికి తెలియజేయాలని సూచించారు. తాను విశాఖ నుంచే పోటీ చేసి విజయం సాధిస్తానని, ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో పురందేశ్వరి తనను అపార్థం చేసుకోరాదని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

English summary
MP T Subbirami Reddy said that Vishaka Loksabha seat belongs to him, not of Daggubati Purandeswari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X