దీక్షను విరమించిన అన్నా హజారే, జైల్ భరో రద్దు

పార్లమెంటులో ఈ రోజు జరిగింది విచారకరమని, దీంతో తాను దీక్షను విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని, ఇప్పుడున్న మార్గం అదొక్కటేననని ఆయన అన్నారు. ఐదు రాష్ట్రాల్లో పర్యటించి ప్రజలను చైతన్యవంతులను చేస్తామని ఆయన చెప్పారు. ద్రోహులకు ఓటు వేయవద్దని తాము ప్రజలకు చెప్తామని ఆయన అన్నారు. సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉందని, ఈ రెండేళ్లు తాను దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తానని ఆయన చెప్పారు. హజారేకు వంద డిగ్రీల ఫారన్‌హీట్ ఉష్ణోగ్రత ఉంది. దీంతో దీక్ష విరమించాలని వైద్యులు ఆయనకు సలహా ఇచ్చారు. దీక్ష విరమించకపోతే మూత్రపిండాలపై ప్రభావం పడుతుందని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications