'చిరు'తో సరిపెట్టండి!: సిఎం ఆశలపై మళ్లీ నీళ్లేనా?

సిఎం అధిష్టానం వద్ద మంత్రివర్గ విస్తరణకు పట్టుబడుతున్నట్లుగా సమాచారం. కిరణ్ ఎప్పటి నుండో తనకు అనుకూలమైన వారితో మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఆశతో ఉన్నారు. అయితే ప్రతిసారి అధిష్టానం ఆయన ఆలోచనలకు చెక్ చెబుతోంది. ఈసారి ఎలాగైనా అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు. ఇందు కోసం నేతల వద్ద తన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం కేవలం చిరంజీవి వర్గం ఎమ్మెల్యేలకు మాత్రమే కేబినెట్లో అవకాశం ఇవ్వడంతో సరిపెట్టాలని సూచిస్తున్నట్లుగా సమాచారం.
బుధవారం సాయంత్రమే కిరణ్ తిరిగి వస్తారనుకున్నప్పటికీ ఆయన మరికొందరు నేతలను కలవడానికి శుక్రవారం సాయంత్రం వరకు అక్కడే ఉండనున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవనున్నారు. ఢిల్లీ చేరుకున్నాక గురువారం రాత్రి కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి గురువారం ఉదయం కూడా భేటీ అయ్యారు. సాయంత్రం కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్నందున ఆంధ్ర ప్రదేశ్‌కు అదనపు విద్యుత్ ఇవ్వాలని విజ్ఢప్తి చేశారు. సిఎం విజ్ఞప్తిని పరిశీలిస్తామని షిండే ఆ తర్వాత విలేకరులతో చెప్పారు.












Click it and Unblock the Notifications