జనవరి 15న కొత్త పార్టీ: బళ్లారి ఎమ్మెల్యే శ్రీరాములు

పదిహేనవ తారీఖున పార్టీ ప్రకటించిన తర్వాత విస్తృతంగా రాష్ట్రంలో పర్యటిస్తానన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారన్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తల్లి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాగా తాను బిజెపిలోనే కొనసాగుతానని, కొత్త పార్టీలో చేరబోనని గాలి సోదరుడు కరుణాకర్ రెడ్డి స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు హైదరాబాదులోని చంచల్‌గూడ జైలులో ఉన్న గాలిని భార్య, పిల్లలు శనివారం కలుసుకున్నారు. గాలిని జైల్లో భార్య, కుమార్తె, కుమారుడు పరామర్శించడం ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications