విజయసాయి రెడ్డి తర్వాత ఎవరి అరెస్టు?

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో విజసాయి రెడ్డి పెట్టుబడుల రూపంలో వైయస్ జగన్ కంపెనీలకు లంచాలు రాబట్టడానికి మధ్యవర్తిగా వ్యవహరించారని సిబిఐ ఆరోపణ. విజయసాయి రెడ్డి వైయస్ జగన్ ఆస్తుల కేసులో రెండో నిందితుడు కాగా, జగన్ తొలి నిందితుడు, నిమ్మగడ్డ ప్రసాద్ 12వ నిందితుడు. జగన్ కంపెనీలకు పెట్టుబడుల రూపంలో లంచాలు రాబట్టడంలో విజయసాయి రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించారని తమ వద్ద సాక్ష్యాలున్నాయని సిబిఐ అంటోంది. జగన్‌తో పాటు నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా ప్రతాప రెడ్డివంటివారితో మిలాఖత్ అయినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని సిబిఐ అధికారులు అంటున్నారు.
సిబిఐ ఆరోపణల ప్రకారం - నిమ్మగడ్డ ప్రసాద్ జగతిలో రూ. 100 కోట్లు, భారతి సిమెంట్స్‌లో రూ. 244 కోట్లు, కార్మెల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 20 కోట్లు, సండూర్ కంపెనీ లిమిటెడ్‌లో రూ. 140 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీలన్నీ జగన్‌కు చెందినవే.












Click it and Unblock the Notifications