జగన్ కేసులో కీలక సూత్రధారి సాయిరెడ్డే: సిబిఐ

Vijaya Sai Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో కీలక సూత్రధారి విజయ సాయి రెడ్డేనని సిబిఐ వ్యాఖ్యానించింది. అక్రమ ఆర్థిక లావాదేవీలన్నీ విజయ సాయిరెడ్డికి తెలుసునని సిబిఐ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలిపింది. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఆస్తులు సంపాదించారని అన్నది. జగన్ ఆస్తుల కేసులో 70 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని చెప్పింది. మార్షియస్ నుంచి సండూర్ పవర్‌కు పెట్టుబడులు మళ్లించారని, ఆ తర్వాత అల్లిబిల్లి కంపెనీలు సృష్టించి వాటికి నిధులు మళ్లించారని, ఇందులో విజయసాయి రెడ్డిదే కీలక పాత్ర అని చెప్పింది. జగతి పబ్లికేషన్స్‌లోకి కూడా భారీగా పెట్టుబడులు తరలించారని ఆరోపించింది. అల్లిబిల్లి కంపెనీల పేర్లు, డైరెక్టర్ల వివరాలు విజయసాయి రెడ్డి వద్దనే ఉన్నాయని చెప్పింది. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ కంపెనీల్లో ఇతర సంస్థల చేత పెట్టుబడులు పెట్టించడంలో విజయ సాయిరెడ్డిదే పాత్ర అని సిబిఐ అన్నది. జగతి పబ్లికేషన్స్ విలువను తప్పుగా లెక్కించారని సిబిఐ చెప్పింది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డికి నాంపల్లి కోర్టు ఈ నెల 17వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయనను హైదరాబాదులోని చంచల్‌గుడా జైలుకు తరలించారు. సోమవారం రాత్రి అరెస్టయిన విజయసాయి రెడ్డిని సిబిఐ మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టింది. విజయసాయి రెడ్డిని 15 రోజుల పాటు తమ కస్టడీకి కోరుతూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ పిటిషన్‌ను విజయసాయి రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. రిమాండ్ రిపోర్టు సంపూర్ణంగా లేకుండా ఎలా కస్టడీకి కోరుతారా విజయసాయి రెడ్డి తరఫు న్యాయవాది అడిగారు. దీనిపై కోర్టు కూడా తీవ్రంగా ప్రతిస్పందించారు. విజయసాయి రెడ్డికి అవినీతి నిరోధక చట్టం వర్తించదని విజయ సాయి రెడ్డి తరఫు న్యాయవాది అన్నారు.

కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఇరు పక్షాలను ఆదేశించారు. విజయసాయి రెడ్డి ఓబిసి డైరెక్టర్‌గా, టిటిడి సభ్యుడిగా ఉన్న విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది గుర్తు చేశారు. తన న్యాయవాదితో మాట్లాడడానికి అనుమతి ఇవ్వాలని విజయసాయి రెడ్డి న్యాయమూర్తిని కోరారు. అందుకు న్యాయమూర్తి అనుమతించారు. తనను సిబిఐ కార్యాలయంలోనే ఉంచేందుకు అనుమతివ్వాలని ఆయన అంతకు ముందు కోర్టును కోరారు. అయితే, అందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత అందుకు వీలు కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సీబీఐ అనుకున్న ప్రకారం మంగళవారం ఉదయమే విజయసాయిని కోర్టులో హాజరు పర్చాల్సి ఉంది. అయితే ఆ సమయంలో ఉగ్రవాది అబూ సలేంపై కోర్టులో విచారణ జరుగుతుండడంతో ఆ కేసు పూర్తి అయిన తర్వాత సాయంత్ర మూడు గంటల ప్రాంతంలో సీబీఐ అధికారులు విజయసాయి రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు రిమాండ్ విదించింది.

సీబీఐ తమను అరెస్టు చేస్తుందని ముందే ఊహించినట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టు ఇంకా అందలేదని అన్నారు. తమను సీబీఐ కస్టడీకి ఇవ్వవద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో సీబీఐ తనను అరెస్టు చేసిన దగ్గర నుంచి ఏయే ప్రశ్నలు వేశారు, ఏమీ అడిగారు అన్న విషయాలు కోర్టులో వివరిస్తానని విజయసాయి రెడ్డి అన్నారు. అయితే దీనికి చాలా సమయం ఉందని, తర్వాత చెప్పవచ్చునని కోర్టు తెలిపింది. విజయసాయి రెడ్డి న్యాయవాదితో మాట్లాడేందుకు మాత్రం గంట సమయం ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+