చంద్రబాబు కుప్పం గోడు, వివక్ష అంటూ విమర్శ

తన తొమ్మిదేళ్ల పాలనలో రోజుకు 9 గంటలు విద్యుత్ సరఫరా చేశామని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా ప్రజలపై ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల భారం మోపుతోందని ఆయన విమర్శించారు. సూక్ష్మ రుణాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆయన అన్ారు. కాంగ్రెసు పాలనలో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఓ పక్క వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండగా, మరో వైపు రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన అన్నారు. ప్రజలపై ప్రభుత్వం పన్నుల భారం మోపుతోందని, రెండేళ్ల తర్వాత ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసి పోవడం ఖాయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications