సిబిఐ కస్టడీకి విజయ సాయి, విచారణకు షరతులు

విజయ సాయి రెడ్డిని ప్రతి రోజు ఉదయం హైదరాబాదు చంచల్‌గుడా జైలు నుంచి తీసుకుని వచ్చి విచారించిన తర్వాత మళ్లీ జైలుకు పంపించాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. విజయ సాయి రెడ్డి అరెస్టు వెనక రాజకీయ దురుద్దేశం ఉందని విజయ సాయి రెడ్డి తరఫు న్యాయవాది ఆరోపించారు. పబ్లిక్ సర్వెంట్స్‌ను ఎవరినీ అరెస్టు చేయకుండా విజయ సాయి రెడ్డిని అరెస్టు చేయడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆయన వాదించారు. విచారణ సమయంలో విజయ సాయి రెడ్డికి వైద్య పరీక్షలు అందించాలని, మధ్యాహ్న భోజనం సమకూర్చాలని కోర్టు సిబిఐని ఆదేశించింది.












Click it and Unblock the Notifications