త్వరలో సిబిఐ ఎదుటకు అంబటి!: ఫోన్ ద్వారా పిలుపు

Ambati Rambabu
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు త్వరలో సిబిఐ ఎదుటకు హాజరు కానున్నట్లు సమాచారం. ఎమ్మార్‌తో ఒప్పందం ద్వారా ఎపిఐఐసి నష్టపోవడానికి కారకులైన పబ్లిక్ సర్వెంట్స్ పాత్రను గుర్తించే క్రమంలో అప్పట్లో ఎపిఐఐసి చైర్మన్‌గా ఉన్న అంబటిని సిబిఐ పిలిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ నుంచి విల్లాలో ప్లాట్లు కొన్న వారిలో అంబటి సోదరుడు కూడా ఉన్నారు. ఈ కొనుగోలుపై కూడా అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఎమ్మార్, ఎంజీఎఫ్‌లో 26శాతం ఉన్న ఎపిఐఐసి వాటా ఆరు శాతానికి తగ్గిపోవడంతో పాటు, విల్లాలు, ప్లాట్లు అమ్మకాల ద్వారా ఎపిఐఐసి తీవ్రంగా నష్టపోవడానికి పరోక్ష కారకులెవరనే కోణంలోనూ సిబిఐ విచారణ చేస్తోంది.

సిబిఐ నుంచి తనకు పిలుపు వచ్చింది నిజమేనని, అయితే విచారణకు హాజరు కావాలని లిఖితపూర్వకంగా ఆదేశాలు అందలేదని, ఫోన్ ద్వారా మాత్రమే తనకు సమాచారం ఇచ్చారని అంబటి రాంబాబు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. సిబిఐ అధికారి ఒకరు తనకు ఫోన్ చేసి 8వ తేదీన విచారణకు హాజరుకావాలని చెప్పారని అన్నారు. తనను సాక్షిగా పిలిచారో లేక ముద్దాయిగా పిలిచారో, నోటీసు వస్తేగానీ తెలియదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+