జగన్ కేసులో మంత్రులను సిబిఐ వదిలేస్తుందా?

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పరిశ్రమలు, వాణిజ్యం, గనులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, రెవెన్యూ, ఆర్థికం వంటి ప్రధాన శాఖలను నిర్వహించిన మంత్రుల పాత్ర గురించి సిబిఐ తన పిటిషన్‌లో ప్రస్తావించలేదు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన అధికారులను చాలా మందిని సిబిఐ పట్టించుకోవడం లేదని అంటున్నారు. భాను, శామ్యూల్, ప్రభాకర్ రెడ్డి వంటి కొద్ది మంది అధికారులను మాత్రం సిబిఐ విచారిచింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సాక్షులుగా వారు సిబిఐ ముందు హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు.
అయితే, వైయస్ జగన్ ఆస్తుల కేసులో విజయ సాయి రెడ్డి అరెస్టు పెను సంచలనానికే కారణమైంది. ఈ కేసు ఇంకా ఎవరెవరికి చుట్టుకుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగానే ఉంది. పలువురిలో ఆందోళన చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications