మగాడివైతే బహిరంగ చర్చకు రా: బాబుకు కెటిఆర్

చంద్రబాబు ఆడా మగా కారని, ఆయన సిద్దాంతం ఆడా మగా సిద్ధాంతం కాదని కెటిఆర్ అన్నారు. హిజ్రాలు కూడా తమ సంఘంలో చంద్రబాబును కలుపుకోవడానికి ఇష్టపడడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నీతినిజాయితీ ఏమిటో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. చంద్రబాబు పెంపుడు జంతువులతో మాట్లాడిస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం నేతలను తిట్టడానికి తిట్లు కూడా లేవని, కెసిఆర్‌ను తిట్టడమే వారు పనిగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. కెసిఆర్‌ను తిడుతున్నది చంద్రబాబు తొత్తులేనని ఆయన అన్నారు. గాడిదపై గంధం చెక్కలు పెడితే సువాసన వెదజల్లిందని, దాంతో గాడిద ఆ సువాసనంతా తన నుంచే వస్తోందని విర్రవీగిందని, అలాగే చంద్రబాబు అన్నా హజారే ఫోటో పట్టుకుని తాను నీతిమంతుడ్ని అని చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు.
స్వర్గీయ ఎన్టీ రామారావుపై చెప్పులేసింది అప్పటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులేనని ఆయన అన్నారు. చంద్రబాబును తెలంగాణ ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. చంద్రబాబుకు కంఠశోష, మోకాళ్ల నొప్పులు మాత్రమే మిగులుతాయని ఆయన అన్నారు. తగుదున్నమ్మా అంటూ చంద్రబాబు వందిమాగధులతో ఉరేగుతున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ అప్పట్లో తెలుగుదేశం వైఖరి మేరకు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మాట్లాడారని ఆయన మోత్కుపల్లి విడుదల చేసిన సిడీపై అన్నారు. తెలుగుదేశం తెలంగాణ వ్యతిరేక వైఖరి నచ్చకే బయటకు వచ్చి పార్టీ స్థాపించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications