డిఎల్‌కు లంచంగా నోట్ల కట్టలు ఆఫర్ చేసిన అధికారి

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అంటూ ఆ పత్రిక ఇలా రాసింది - తనను బదిలీ చేస్తున్నట్లు జయకుమారికి ఎందుకో అనుమానం వచ్చింది. దీంతో వెంటనే ఆమె సచివాలయానికి వెళ్లారు. మంత్రి రవీంద్రా రెడ్డిని కలిశారు. 'సర్ నను ట్రాన్స్‌ఫర్ చేయాలని అనుకుంటున్నారట!' అంటూ... తనను బదిలీ చేయొద్దని, రంగారెడ్డి జిల్లా అధికారిగానే ఉంచాలని విన్నవించుకున్నాను. ఈ విషయం తనకు తెలియదని, పరిశీలిస్తానని మంత్రి చెప్పారు. కానీ జయకుమారి అక్కడి నుంచి కదల్లేదు.తన వెంట తెచ్చిన బ్యాగు నుంచి రూ.3 లక్షల ఫెళఫెళలాడే కరెన్సీ తీసి, మంత్రి టేబుల్ ముందు పెట్టారు. మంత్రి ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు.
ఆశ్చర్యం నుంచి తేరుకుని 'ముందు నా చాంబర్ నుంచి బయటికి వెళ్లిపోండి' అని కసురుకున్నారు. ఆ తర్వాత ఆమె మంత్రి డీఎల్ చాంబర్ నుంచి బయటికి వచ్చి ఆయన ఓఎస్‌డీ గౌడ్‌ను కలిశారు.'సార్... ఇది.. ఉంచుకోండి. ట్రాన్స్‌ఫర్ చేయకుండా చూడండి' అంటూ ఈసారి గౌడ్ టేబుల్ మీద రూ.3 లక్షలు పెట్టారు. ఆమె తీరును పసిగట్టిన డీఎల్ ముందుగానే ఓఎస్డీకి ఫోన్ చేసి విషయం చేరవేశారు. వెరసి... ఓఎస్డీ కూడా జయకుమారిని కసిరి పంపారు. ఈ ఉదంతాన్ని మంత్రి ధ్రువీకరించినట్లు ఆ పత్రిక తెలిపింది.












Click it and Unblock the Notifications