నేనే నేరుగా వస్తా: తెరాస టార్గెట్‌గా చంద్రబాబు

ఉప ఎన్నికల్లో తమ పార్టీ అన్ని సీట్లకు పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. రైతులపై ప్రేమ ఉంటే వారు కూడా పోరాడాలని, వారు పోరాడకుండా పోరాడేవారిపై దాడికి దిగుతున్నారని ఆయన అన్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేక అలా చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల కష్టనష్టాలు తెలుసుకునేందుకు వస్తుంటే తెలంగాణ అంటూ అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పినా అడ్డుకుంటే ఎలా అని ఆయన అడిగారు. లక్ష్మక్కపల్లి నుంచి ఆయన తన రైతు పోరుబాటను ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీపై ప్రజలకు అచంచల విశ్వాసం ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications