చంద్రబాబుపై కేసు పెట్టాలని వరంగల్ కోర్టు ఆదేశాలు

Chandrababu Naidu
వరంగల్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టాలని వరంగల్ జిల్లా అడిషనల్ జ్యూడిషియల్ మెజిస్ట్రీట్ శుక్రవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, న్యాయవాదులు వేసిన పిటిషన్ పైన స్పందించిన కోర్టు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవూరి ప్రకాశ్‌పై వారం రోజుల్లో కేసు నమోదు చేసి విచారణ జరపాలని హన్మకొండ పోలీసులను ఆదేశించింది. కాగా చంద్రబాబు రైతు పోరు బాట యాత్రను టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవాలని చూడటం, వారిని టిడిపి ప్రతిఘటించడం నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే.

కాగా చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా టిడిపి కార్యకర్తలు, పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డిని కలిసి విజ్ఞప్తిచేశారు. కాగా జిల్లాలోని నెక్కొండలో టిఆర్ఎస్, టిడిపి కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+