సజీవంగా శిలువ వేయించుకున్న మహిళ

తాను శిలువ వేసుకున్నా తనకు రక్తం కారలేదని ఆమె పోలీసులకు చెప్పింది. గాయపడిన మరియమ్మకు పోలీసులు చికిత్స చేయించారు. మరియమ్మ భక్తులకు చికిత్స కూడా చేస్తుంది. వారం వారం ఆమె వద్దకు భక్తులు వస్తుంటారు. భక్తుల సంఖ్య పెరగాలంటే సజీవంగా శిలువ వేయించుకోవాలని క్రీస్తు కలలో కనిపించడం వల్లనే తాను ఆ పనికి దిగానని మరియమ్మ చెబుతోంది. మరియమ్మ వ్యవహారానికి సంబంధించిన వార్తాకథనాన్ని తెలుగు టీవీ చానెళ్లన్నీ ప్రసారం చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా ప్రసారమయ్యాయి. ఆమెను శిలువ వేసిన దృశ్యాలు ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్‌లో ప్రసారమయ్యాయి. శిలువపై పరుండ బెట్టి అరచేతులపై మేకులు దిగబెట్టిన దృశ్యాలు కనిపించాయి.












Click it and Unblock the Notifications