రాజకీయాల్లోకి త్వరలోనే వస్తా, పోటీ చేస్తా: బాలకృష్ణ

తానొక్కడే రాజకీయాలలో ఉండాలనే నిబంధన లేదని, అలాగని రాకూడదని ఎవరిపైనా ఒత్తిళ్లు చేసేదిలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయమన్నారు. ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణా విషయంలో తనకు ప్రత్యేక అభిప్రాయమేదీ లేదని, పార్టీ విధానమే తన వైఖరని చెప్పారు. అంతకుముందు బాలకృష్ణ గన్నవరం విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా విజయవాడ చేరుకున్నారు. నేరుగా ఆయన పండు ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాలకృష్ణ వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్, మాజీ ఎంపీ గద్దే రామ్మోహన్, పార్టీ నాయకులు బొండా ఉమామహేశ్వరరావు తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications