చిరంజీవి టీ పార్టీకి ఆజాద్ సహా స్పీకర్ మనోహర్

ఉప ఎన్నికలను ఎదుర్కోలేకనే జగన్ వర్గం శాసనసభ్యులపై అనర్హత వేటు వేసే విషయంలో ఆధికార కాంగ్రెసు పార్టీ వ్యూహాత్మకంగా జాప్యం చేయిస్తుందని అనుమానాలకు విందు సమావేశానికి నాదెండ్ల మనోహర్ హాజరు కావడం వల్ల బలం చేకూరుతుందని కూడా సాక్షి దినపత్రిక అభిప్రాయపడింది. విందు సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు మినహా మిగతా సమన్వయ కమిటీ సభ్యులు, పార్లమెంటు సభ్యుడు కెవిపి రామచందర్ రావు చిరంజీవి ఇచ్చిన విందు సమావేశంలో పాల్గొన్నారు. గురు, శుక్రవారాల్లో జరిగిన భేటీల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభావంపై, జగన్ చేస్తున ఓదార్పు యాత్రల ప్రభావంపై ఆజాద్ దృష్టి సారించినట్లు చెబుతున్నారు. జగన్‌ను దీటుగా ఎదుర్కోవాలని పార్టీ నాయకులకు సూచించినట్లు కూడా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications