తప్పును శ్రీలక్ష్మిపైకి నెడుతున్న సబితా ఇంద్రారెడ్డి

కోర్టుకు సమర్పించిన సిబిఐ సమర్పించిన చార్జిషీట్‌లో సబితా ఇంద్రా రెడ్డి వాంగ్మూలాన్ని చేర్చారు. లీజు అప్పటికే ఇచ్చినందున అనంతపురం జిల్లాలోని 25 హెక్టార్ల భూమిని ఒఎంసికి అప్పగించాలని శ్రీలక్ష్మి తనపై ఒత్తిడి తెచ్చారని సబితా ఇంద్రా రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సాక్షిగానే ఉన్న సబితా ఇంద్రారెడ్డిని పేరును నిందితురాలిగా చేరుస్తారా, లేదా అనేది చెప్పడానికి వీలు కావడం లేదు. తమకు లభించే సాక్ష్యాలను బట్టి అనుబంధ చార్జిషీట్ వేస్తామని సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ అంటున్నారు. వచ్చే పది రోజుల్లో సిబిఐ అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేసే అవకాశం ఉంది. చార్జిషీట్‌లో శ్రీలక్ష్మి పేరును కూడా నిందితురాలిగా చేర్చలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే తప్ప శ్రీలక్ష్మి పేరును నిందితురాలిగా చేర్చడానికి వీలు కాదు.












Click it and Unblock the Notifications