వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు పోటీగా చేయను, నెలలోగా వేటు: లగడపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

lagadapati rajagopal
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంక్రాంతి పర్వదిన తర్వాత గాంధేయ మార్గంలో దీక్ష చేసుకోవచ్చునని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సూచించారు. లగడపాటి, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివ రావు, మంత్రి మోపిదేవి వెంకట రమణ, సీనియర్ నేత సి.రామచంద్రయ్యలు ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. అనంతరం లగడపాటి మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి తర్వాత కెసిఆర్ దీక్షకు దిగితే తాను పోటీ దీక్ష చేయనన్నారు. 2009లో కెసిఆర్ దీక్ష చేసినప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో తాను దీక్ష చేయాల్సి వచ్చిందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో పర్యటిస్తున్నప్పుడు భద్రత కల్పించాలన్నారు. ప్రజాస్వామ్య భారతంలో ఎవరు ఎక్కడైనా తిరగవచ్చునని అడ్డుకునే హక్కు లేదన్నారు. అభిప్రాయాలు చెప్పవచ్చు కానీ అడ్డుకోవడం సరికాదన్నారు.

జగన్ వర్గం ఎమ్మెల్యేల అనర్హత విషయం నెల రోజుల్లో తేలవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీకి కూడా ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చిట్టా బయట పెడతానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వం వరంగల్లో భద్రత కల్పించిందన్నారు. కాగా ముఖ్యమంత్రితో భేటీ అయిన నేతలు తాజా రాజకీయ పరిస్థితులు, ఉప ఎన్నికల అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడితే ఆయా జిల్లాల నేతలు వెళ్లాల్సిన వ్యూహంపై చర్చించినట్లుగా సమాచారం.

English summary
Vijayawada MP Lagadapati Rajagopal said today that he will not take fast against TRS chief K Chandrasekhar Rao. He met CM Kiran Kumar Reddy and talk about present political situations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X