జగన్ వర్గంపై ఏ క్షణమైనా నిర్ణయం, సిద్ధం కండి!: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: ఇప్పటికే స్పీకర్ ఏడుగురి రాజీనామాలు ఆమోదించారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలపై ఏ క్షణమైనా నిర్ణయం తీసుకోవచ్చునని ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్టీఆర్ భవనంలో ఆయన పార్టీ జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. మేలో మహానాడు ఉన్నందున అప్పటికల్లా పార్టీ సభ్యత్వాల నమోదు, పునరుద్ధరణ కార్యక్రమాలు పూర్తి చేసి జిల్లా కమిటీలను నియమించుకోవాలని ఆదేశించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ప్రజాసమస్యలపై ఈ భేటీలో చర్చ జరిగింది.

ఈ నెల 19, 20, 21 తేదీల్లో నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి సభ్యత్వాల నమోదు, పునరుద్ధరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ఈ భేటీలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మహిళలకు, యువతకు సభ్యత్వంలో ప్రాధాన్యత ఇవ్వాలని బాబు వారికి సూచించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించి పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని బాబు వారికి సూచించారు. అవినీతి, భూములు, విద్యుత్తు, రైతు సమస్యలు, ఫీజుల రీయింబర్స్‌మెంట్ తదితర స్థానిక అంశాలపై శాసనసభా నియోజకవర్గాలు, జిల్లా స్థాయిల్లో ఉధృత పోరాటాలు నిర్వహించాలని చెప్పారు. జిల్లాల్లో ప్రస్తుత సమస్యలపై ఎప్పటికప్పుడు పోరును ఉధృతం చేయాలని, ఉప ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఆదేశించారు. సరిగా పని చేయని వారిపై బాబు సీరియస్ అయ్యారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+