హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ పథకాన్ని టార్గెట్ చేసిన చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన జలయజ్ఞం పథకంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వాఖ్యలు చేశారు. అవినీతి కోసమే ఆ పథకాన్ని చేపట్టారని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముళ్లను, టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌ను ఆయన టార్గెట్ చేశారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట భవనంలో టిడిపి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాబు మాట్లాడారు. ముఖ్యమంత్రి సోదరులు రాజకీయేతర శక్తిగా మారారని ఆయన అన్నారు. డబ్బులు వచ్చే చోట కాంగ్రెసు నేతల దందా ఎక్కువైందని విమర్శించారు. బిసిలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని అందులో భాగంగానే బిసి రిజర్వేషన్‌లలో ముస్లింలను కలిపిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం మాఫియా రాజ్యమేలుతోందన్నారు. ఒక్క వ్యక్తికి ఒకే మద్యం దుకాణం ఉండాలనేది మద్యం రూల్ అని కానీ పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణకు అన్ని దుకాణాలు ఎలా ఉన్నాయన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్లనే రైతులు రాష్ట్రంలో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారని అన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ తన రైతు పోరు బాట యాత్రను త్వరలో పూర్తి చేస్తానని చెప్పారు. రైతు సమస్యలను జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత టిడిపిదేనన్నారు. కిరణ్ ప్రవేశ పెట్టిన రాజీవ్ యువకిరణాలు ఓ బూటకమన్నారు. పోలవరం టెండర్లకు సంబంధించిన ఫైల్‌ను స్పీకర్ నాదెండ్ల మనోహర్ కుమార్ ముందు పెడితే అందులో జరిగిన అక్రమాలు నిరూపిస్తామన్నారు. టెండర్లలో టిఆర్ఎస్, సిఎం కలిసి గోల్ మాల్ చేశారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమన్నారు. కాంగ్రెసు తీరు చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యమా రాచరిక వ్యవస్థనా అనే అనుమానం వస్తుందన్నారు. జలయజ్ఞం రైతుల కోసం కాకుండా అవినీతి కోసమేనన్నారు. దివంగత ఎన్టీఆర్ ఇదే రోజు 1983లో సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారని, ఈ రోజు నుండి మనం విభేదాలు మరిచి సమన్వయంతో వెళదామని కార్యకర్తలకు సూచించారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu targeted CM Kiran Kumar Reddy brothers and YSR Jalayagnam scheme on monday. He also blamed TRS chief KCR for Polavaram issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X