మీకో దండం, తెలంగాణపై అడుగొద్దు: జైపాల్ రెడ్డి

S Jaipal Reddy
హైదరాబాద్: కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి ఆదివారం రంగారెడ్డి జిల్లాలోని తన నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. మీడియా ప్రతినిధులను వేడుకోవడం తప్ప ఆయన ఏమీ చేయలేకపోయారు. తెలంగాణపై వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వడానికి నిరాకరించారు. మీకో దండం.. అవన్నీ అడుగొద్దు అంటూ ఆయన తప్పించుకున్నారు. తెలంగాణపై మీ వైఖరి ఏమిటి, ఉప రాష్ట్రపతి పదవికి రేసులో ఉన్నారా అంటూ మీడియా ప్రతినిధులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. మీడియా ప్రతినిధులు వేసిని ఆ ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వకుండా దాటవేశారు.

తాను ఉప రాష్ట్రపతి పదవికి రేసులో లేనని, అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. ఈ విషయంలో వార్తలు సృష్టించి, రాసేస్తున్నారని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో అవసరం మేరకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నుంచి జైపాల్ రెడ్డి లోకసభకు ఎన్నికయ్యారు. తెలంగాణపై పెరుగుతున్న ఒత్తిడితో ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవచ్చుననే వార్తలు ఇటీవల వచ్చాయి. అలా తప్పుకుంటూ ఉప రాష్ట్రపతి పదవికి రేసులో ఉంటారని కూడా వార్తాకథనాలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+