థియేటర్లు ఇవ్వకుంటే సినిమాలు అడ్డుకుంటాం: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: జై తెలంగాణ సినిమా ప్రదర్శనకు థియేటర్లు ఇవ్వకుంటే ఇతర ప్రాంతాలకు చెందిన సినిమాలను తాము అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు థియేటర్ల యజమానులను ఆదివారం హెచ్చరించారు. టిఆర్ఎస్ మహిళా విభాగం, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం వేర్వేరుగా రూపొందించిన నూతన సంవత్సర డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఇతివృత్తంతో తమ ప్రాంత వ్యక్తులు తీసే సినిమాలకు థియేటర్ల యజమానులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తెలంగాణలోని థియేటర్లలోనూ సీమాంధ్ర వారే శాసిస్తున్నారని, ఒక్కరిద్దరి ఆధీనంలోనే వందల థియేటర్లు ఉన్నాయని మండిపడ్డారు. వాళ్ల సినిమాలకు మాత్రమే థియేటర్లు ఇస్తూ మన సినిమాలకు ఇవ్వడం లేదన్నారు. థియేటర్లపై పిడికెడు మంది ఆంధ్రా నిర్మాతల ఏకస్వామ్యాన్ని ఎదిరిస్తామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

మహిళలను వంటింటికి పరిమితం చేయకుండా వారికి అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పరిశ్రమలలో స్థానికులకు తొంబై శాతం ఉద్యోగాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పరిశ్రమలను ప్రోత్సహిస్తూ వాటిల్లో తొంబై శాతం స్థానికులకే ఇస్తామన్నారు. తెలంగాణకు చెందిన ప్రైవేట్ ఉద్యోగులను వేధిస్తే వారి యాజమాన్యాల భరతం పడతామని, వెంటపడుతామని కెసిఆర్ హెచ్చరించారు. స్థానిక సంస్థలతోపాటు, చట్ట సభల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందేనన్నారు. మహిళా బిల్లు తీసుకొస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. తెలంగాణ కోసం ఎన్ని రకాలుగా ఉద్యమం చేసినప్పటికీ తోలు మందం ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు జగన్ ఉద్యమాన్ని అయోమయానికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ సాధించే వరకు టిఆర్ఎస్ విశ్రమించదన్నారు. ఎనిమిది వందల మంది చనిపోయినా కేంద్రం స్పందించక పోవడం శోచనీయమన్నారు. ప్రజాభిప్రాయంపై కేంద్రానికి గౌరవం లేదన్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో జెఏసి సమావేశాన్ని ఏర్పాటుచేసి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తామన్నారు. మళ్లీ సమ్మె చేయటానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ సాధన పోరాటంలో మహిళలు, ప్రైవేట్ ఉద్యోగులు చురుగ్గా ముందుండాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+