హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబటి రాంబాబుది అతితెలివన్న పయ్యావుల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
హైదరాబాద్: ఎమ్మార్ కేసు విచారణలో భాగంగా సిబిఐ అధికారులు తన సంగతి అడిగితే తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును విచారించాలని అడగడటం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అతితెలివితేటలకు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ సోమవారం ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ అంబటి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని దోషులుగానే పరిగణిస్తున్నారన్నారు. మొదట అంబటి తన నిజాయితి నిరూపించుకొని ఇతరుల గురించి మాట్లాడాలని సూచించారు.

ఎమ్మార్‌లో అంబటి రాంబాబు పాత్ర స్పష్టమైందన్నారు. సిబిఐ విచారణలో అన్నీ వెల్లడవుతాయన్నారు. భువితేజ బయటకు వస్తే రాంబాబు చరిత్ర బట్టబయలవుతుందన్నారు. ప్రజాధనం టూఠీ చేసిన వారు చంద్రబాబు పైన విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. కాగా మద్యం మాఫియాపై ఎసిబి నివేదిక బయటపెట్టి ఉంటే మైలవరం సంఘటన జరిగి ఉండేది కాదని మరో నేత దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. నివేదిక బయట పెడితే ప్రభుత్వం కూలుతుందనే భయంతోనే మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. కల్తీసారా కారణంగా 19 మంది చనిపోతే ప్రభుత్వం నుండి ఎవరూ పరామర్శించలేదని, కనీసం స్థానిక ఎంపీ లగడపాటి రాజగోపాల్ పరామర్శించలేదని విమర్శించారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మాఫియా కింగ్ అని ధ్వజమెత్తారు.

English summary
TDP senior leader Payyavula Keshav blamed YSR Congress party leader Ambati Rambabu. Devineni Umamaheswara Rao lashes out at Lagadapati Rajagopal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X