జగన్ తెలంగాణ దీక్ష టెన్షన్, చంద్రబాబు పంథానే

జగన్ దీక్ష అడ్డుకోవద్దని, జగన్ తెలంగాణకు వ్యతిరేకం కారని వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణ నాయకులు కోరుతూనే ఆర్మూర్‌లో జగన్ దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాను చేపట్టబోయే దీక్షపై వైయస్ జగన్ సోమవారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లా పర్యటన విషయంలో అనుసరించిన పంథానే తన ఆర్మూర్ పర్యటన విషయంలో అనుసరించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణవాదుల హెచ్చరికలను సవాల్‌గా స్వీకరించి ఆర్మూర్‌లో దీక్ష చేపట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
వైయస్ జగన్ రేపు మంగళవారం ఉదయం 7 గంటలకు హైదరాబాదు నుంచి బయలుదేరుతారు. దారిలో తనను చూసేందుకు వేచి చూసే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగాలా, చడీచప్పుడు కాకుండా ఆర్మూర్ చేరుకోవాలా అనే సందేహంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు ఆయన ఆర్మూర్ చేరుకుంటారని భావిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన రైతు దీక్ష సాగుతుంది. అయితే, జగన్ పర్యటన సందర్భంగా ఏ విధమైన సంఘటనలు చోటు చేసుకుంటాయోననే ఉత్కంఠ నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications