చిరంజీవి విలీనమైతే, బాబు అమ్ముడు పోయారు: జగన్

మనం రైతుల కోసం ఓటు వేస్తున్నామని అలాంటప్పుడు ప్రజల అండదండలు మనకు ఎప్పుడూ ఉంటాయని, వైయస్సార్ బాటలో నడవాలనుకున్న ప్రతి ఒక్కరూ అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని తన ఎమ్మెల్యేలకు సూచించానని వారు నా మాటకు గౌరవం ఇచ్చారన్నారు. దివంగత వైయస్‌కు ముందు చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఎవరూ ప్రాజెక్టుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో, రైతులు, రైతు కూలీల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. రైతన్నల మీద సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వం రైతులను, కూలీలను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications