లోకేష్‌పై వెనక్కి తగ్గిన బాబు, ఎన్టీఆర్ ఫ్యామిలీ మీట్

Nara lokesh-Chandrababu Naidu
చిత్తూరు: దూరమవుతున్న ఎన్టీ రామారావు తనయుడు హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌లను, తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడిని దగ్గర చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎట్టకేలకు తన స్వగ్రామం నారావారి పల్లెలో పార్టీ వ్యవస్థాపకాధ్యక్షుడు ఎన్టీ రామారావు విగ్రహాన్ని స్థాపించడానికి నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ మీద చంద్రబాబుకు ఏ విధమైన గౌరవం లేదని, అందుకే నారావారి పల్లెలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలకు సమాధానంగానే కాకుండా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల మద్దతును తిరిగి పొందడానికి నారావారి పల్లెలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చంద్రబాబు వేదికగా మార్చుకుంటున్నారు.

సంక్రాంతి పర్వదినం రోజు చంద్రగిరి శాసనసభా నియోజకవర్గంలోని నారావారి పల్లెలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో ఇష్టాగోష్టి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆయన జనవరి 13, 14 తేదీల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి నారావారి పల్లెలో ఉంటారు. బాలకృష్ణ, హరికృష్ణ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సమయంలోని తన సోదరుడు రామ్మూర్తి నాయుడి కుమారుడు గిరీష్‌కు చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రి గల్లా అరుణ కుమారి కాంగ్రెసు నుంచి ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జీగా చంద్రబాబు నాయుడు గతంలో తన కుమారుడు నారా లోకేష్‌ను నియమించే ప్రయత్నాలు చేశారు. అయితే, నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. అయితే పూర్తిగానే నారా లోకేష్‌ను చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జీగా నియమించే ఆలోచనను చంద్రబాబు విరమించుకున్నట్లు ప్రస్తుత పరిణామాన్ని బట్టి అర్థమవుతోంది. గిరీష్ తన తండ్రి వ్యాపార లావాదేవీలను పర్యవేక్షిస్తున్నారు. తాజా పరిణామంతో చంద్రబాబు కుటుంబ సభ్యుల సందర్శనకు గిరీష్ ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+