తెలంగాణ ఇష్యూ, చంద్రబాబుపై బొత్స సెటైర్లు

Botsa Satyanarayana
హైదరాబాద్: తెలంగాణ విషయంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై సైటెర్లు వేశారు. రెండు కళ్లు, మూడు కాళ్ల సిద్ధాంతమంటే సరిపోదని, ప్రతి రాజకీయ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉండాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు స్పష్టమైన వైఖరి వెల్లడించాల్సి ఉందని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకం కాదంటే సరిపోదని, స్పష్టమైన వైఖరి చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల్లో భాగస్వాములు కారా, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్టీ కాదా అని ఆయన అడిగారు. ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉందని ఆయన అన్నారు.

తెలంగాణపై కాంగ్రెసు పార్టీ స్పష్టమైన వైఖరి తీసుకుంటుందని, కాంగ్రెసు పార్టీయే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని, అందుకు సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. తెలంగాణపై సమైక్యమో, విభజనో కాంగ్రెసు పార్టీ సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు, వైయస్ జగన్ రైతు యాత్రలు, దీక్షలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను తమ పార్టీ త్వరలో ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. స్టేషన్ ఘనపూర్, కామారెడ్డి నియోజకవర్గాల సమీక్ష జరిపిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+