విజయ సాయి రెడ్డి 3 రోజులు పెదవి విప్పలేదు: సిబిఐ

కేసుతో సంబంధం ఉన్న ఇతర నిందితుల వివరాలను విజయ సాయి రెడ్డి నుంచి తెలుసుకోవాల్సి ఉందని సిబిఐ వాదించింది. విజయ సాయి రెడ్డిని అరెస్టు తర్వాత కొంత మంది ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పారని తెలిపింది. విదేశీ ఆర్థిక లావాదేవీల వ్యవహారం కూడా విజయసాయి రెడ్డి నుంచి రాబట్టాల్సి ఉందని తెలిపింది. అనేక విషయాలపై విజయ సాయి రెడ్డిని విచారించాల్సి ఉందని చెప్పింది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం లోగా వాదనలు ముగిశాయి.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో విజయసాయి రెడ్డి సిబిఐ కస్టడీని నాంపల్లి కోర్టు పొడిగించింది. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు విజయసాయి రెడ్డిని సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనను ప్రతి రోజు ఉదయం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విచారించాలని, ఐదు గంటల తర్వాత జైలుకు అప్పగించాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు విజయ సాయి రెడ్డిని కోర్టు ముందు హాజరు పరచాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications