జగన్‌కు భద్రతపై కిరణ్ ప్రభుత్వం మీద విహెచ్ రుసరుస

జగన్ యాత్ర పట్ల ప్రభుత్వం, పోలీసు విభాగం అత్యుత్సాహం ప్రదర్శించాయని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రేపు ఉస్మానియ విశ్వవిద్యాలయం తెలంగాణ నాయకులు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో పర్యటిస్తామంటే ప్రభుత్వం ఇదే విధమైన బందోబస్తు కల్పిస్తుందా అని ఆయన అడిగారు. చంద్రబాబు రైతు పోరుబాటలో ఐదు నిమిషాలు కూడా రైతుల గురించి మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను తిట్టడానికే ఎక్కువ సమయం తీసుకున్నాడని చెప్పారు. రైతు పోరుబాట సందర్భంగా పోలీసులు, చంద్రదండు కలిసి తెలంగాణ ప్రజల పై దాడులు చేశారని విమర్శించారు.












Click it and Unblock the Notifications