నయీమ్‌ను పట్టివ్వండి: రాష్ట్ర పోలీసులపై సిబిఐ ఒత్తిడి

గ్యాంగస్టర్ పటోళ్ల గోవర్దన్ రెడ్డి హత్యతో నయీమ్ పేరు మరో మారు వార్తలకెక్కింది. పటోళ్ల గోవర్దన్ రెడ్డి హత్య వెనక నయీమ్ హస్తం ఉండవచ్చునని హైదరాబాదు పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. నయీమ్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రత్యేక నిఘా విభాగం (ఎస్ఐబి)ని అదేశించినట్లు ఆంధ్రప్రదేశ్ డిజిపి దినేష్ రెడ్డి రెండు వారాల క్రితం చెప్పారు. నయీమ్‌పై దేశవ్యాప్తంగా పలు కేసులున్నాయి. నయీమ్ ఆచూకీ గురించి ఖాన్‌కు గానీ, దినేష్ రెడ్డికి గానీ ఏ విధమైన సమాచారం లేదు. 2007లో సిటీ క్రిమినల్ కోర్టు నుంచి తప్పించుకుని పారిపోయిన తర్వాత నయీమ్ ఆచూకీ ఏ మాత్రం తెలియడం లేదు. నల్లమల కోబ్రా వంటి సంస్థల పేరు మీద పౌర హక్కుల సంఘాల నాయకుల హత్యకు దిగిన ముఠా వెనక నయీమ్ ప్రధాన పాత్ర పోషించాడనే విమర్శలున్నాయి.
సొహ్రబుద్దీన్, అతని భార్య కౌశర్ బీ హైదరాబాదు వెళ్లడానికి నయీమ్ కారణమని గుజరాత్ (క్రైమ్) చార్జిషీట్‌లో అనుమానాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్ వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని గుజరాత్ పోలీసులకు అందించినట్లు ఆరోపణలున్నాయి. సొహ్రబుద్దీన్, కౌశర్ వెంట బస్సులో ఉన్నది నయీమ్ అని మొదట అనుమానించారు. కానీ అతను సొహ్రబుద్దీన్ అనుచరుడు తులసీరాం ప్రజాపతి అని సిబిఐ ఆ తర్వాత గుర్తించింది. ఆ తర్వాత అతను కూడా హతమయ్యాడు.
సొహ్రబుద్దీన్, కౌశర్ బీల ఎన్‌కౌంటర్‌కు, ప్రజాపతి ఎన్‌కౌంటర్‌కు మధ్య సంబంధం ఉందని గుర్తించిన సుప్రీంకోర్టు ప్రజాపతి కేసును కూడా సిబిఐకి అప్పగించింది. హరేన్ పాండ్యా హత్య కేసు మిస్టరీని విడదీయడానికా, మరి దేనికి సిబిఐ అధికారులు నయీమ్ కోసం అడుగుతున్నారని స్పష్టంగా తెలియడం లేదు.












Click it and Unblock the Notifications