పిల్లల గొంతు కోసిన తల్లి, కారు ప్రమాదంలో నలుగురు మృతి

Kadapa Map
హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గురువారం ఉదయం విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. కడప జిల్లాలోని పొద్దుటూరు మండలం దేవాంగులలో కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన కూతురు, కొడుకు గొంతు కోసి తాను గొంతు కోసుకుంది. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఇద్దరు పిల్లలతో సహా తల్లిదండ్రులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. ఇది గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం బంజేరుపల్లి వద్ద ఓ కారు చెట్టును ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. వీరు అదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన వారుగా తెలుస్తోంది. మంచిర్యాల నుండి నర్సంపేట వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.

తూర్పు గోదావరి రాజమండ్రి సమీపంలోని రాజానగరం దివాన్ చెరువు వద్ద లారీ-ట్యాంకర్ ఢీ కొన్నాయి. దీంతో ట్యాంకర్‌లోని ఆయిల్ మొత్తం లీక్ అవుతుంది. రక్షణ శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు గన్నవరం సబ్ జైలు నుండి విశాఖపట్నం తరలిస్తున్న ఓ ఖైదీ నడుస్తున్న రైలు నుండి దూకి పారిపోయాడు. గన్నవరం సబ్ జైలు నుండి విజయవాడ మీదుగా కౌన్సెలింగ్ కోసం విశాఖ తరలిస్తుండగా ఖైదీ తప్పించుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+