విజయ సాయి రెడ్డికి ఊరట: సిబిఐ కస్టడీ రద్దు

విజయ సాయి రెడ్డిని వారం రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిబిఐ అదే కోర్టును కోరారు. అందుకు ఆ కోర్టు అనుమతించింది. దీంతో విజయ సాయి రెడ్డి ప్రతి రోజూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించే పనికి సిబిఐ పూనుకుంది. అయితే, పండుగ రోజులు కావడంతో విజయ సాయి రెడ్డిని విచారించడం కూడా సిబిఐకి కష్టంగా మారిందంటూ ఓ ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. అధికారులు చాలా మంది సెలవుపై వెళ్లడంతో అది కష్టంగా మారిందని చెబుతన్నారు. పైగా విజయ సాయి రెడ్డి సిబిఐ విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని, ఏది అడిగినా తనకు తెలియదని చెబుతున్నారని వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications