హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై వైయస్ తప్పని జగన్ తేల్చారు: జెసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: 2009 ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రాంతానికి వెళ్లాలంటే వీసా తీసుకోవాలా అని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రశ్నించారని, కాని ఆయన వ్యాఖ్యలు తప్పని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనల ద్వారా తేటతెల్లమైందని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి గురువారం అభిప్రాయపడ్డారు. వారి పర్యటనల ద్వారా తెలంగాణ వెళ్లేందుకు వీసా అవసరం లేదని తేలిందన్నారు. మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇష్టానుసారంగా జరుగుతుందన్నారు. ఖాళీలు ఉంటే విస్తరణ చేయాలా అని ఆయన ప్రశ్నించారు.

గతంలో మాజీ ముఖ్యమంత్రి సంజీవ రెడ్డి కేవలం పన్నెండు మందితోనే ప్రభుత్వాన్ని నడిపారని గుర్తు చేశారు. విస్తరణ గురించి చిరంజీవికి అధిష్టానం ఏమైనా చెప్పిందేమో తనకు తెలియదన్నారు. జగన్, చంద్రబాబు యాత్రల వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు. ఎవరో చెప్పితే పని చేయడం, చెప్పక పోతే ఊరుకోవడం ప్రభుత్వం పని కాదన్నారు. ఎవరు చెప్పకపోయినా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy and TDP chief Nara Chandrababu Naidu Telangana tour show late YSR comments are wrong, said JC Diwakar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X