ముగ్గురు మంత్రులను కలిశా, అయినా....: చిరంజీవి

Chiranjeevi
విశాఖపట్నం: తన నియోజకవర్గం తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో అనస్థీషియన్ లేరని, ఆ పోస్టు భర్తీ చేయాలని ఆరోగ్యశాఖలో ముగ్గురు మంత్రులను కలిశానని, చివరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసినా ప్రయోజనం లేదని కాంగ్రెసు పార్టీ నేత, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి అన్నారు. చిన్న పని చేయడానికే ఇన్ని ఇబ్బందులైతే.. ఇక అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. విధానాన్ని మార్చాలని ఆయన సూచించారు. కొత్త ఎమ్మెల్యేల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన బుధవారం మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు బాలికల హాస్టల్‌ను సందర్శించినప్పుడు, అక్కడి అమ్మాయిలను ఏం కావాలని అడిగితే, "ఏమీ వద్దు. మరుగుదొడ్లు కట్టిస్తే చాలు' అని చెప్పగా.. తాను సొంత డబ్బు రూ. 3 లక్షలతో మరుగుదొడ్లు, బాత్రూమ్‌లు కట్టించానన్నారు. అన్నిచోట్లా ఇలా చేయ లేం కాబట్టి ప్రభుత్వ పరంగా తగిన వసతులు కల్పించాల్సి ఉందన్నారు.

బాక్సైట్ తవ్వకాలను చేపట్టవద్దని ఆయన కోరారు. బాక్సైట్ తవ్వకాలు చేపడితే వాతావరణ సమతుల్యత దెబ్బ తింటుందని ఆయన అన్నారు. బాక్సైట్ నిక్షేపాల వల్ల భూములకు నీళ్లను నిల్వ చేసుకునే సమర్థత ఉంటుందని, బాక్సైట్ తవ్వకాలు జరిపితే అది దెబ్బ తింటుందని ఆయన అన్నారు. అధికారులు తమకు ఏమీ చెప్పడం లేదని ఎమ్మెల్యేలు అన్నా రు. జిల్లా సమీక్ష మండలి రూపొందించే ప్రణాళికల్లో ఎమ్మెల్యేలు చురుకైన పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం కార్యదర్శి ఎస్‌పీ టక్కర్ చెప్పగా, "వాటిలో మా పాత్ర ఎక్కడుంది? అధికారులు అవకాశం ఇస్తే కదా?'' అంటూ పలువురు ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+