ఓ మహిళా టెక్కీ ఆత్మహత్య: మరో మహిళా టెక్కీ హత్య

ఇదిలా ఉంటే , కేరళకు చెందిన మరో మహిళా టెక్కీ గుర్గావ్‌లోని తన ఫ్లాట్‌లో దారుణ హత్యకు గురైంది. డిఎల్‌ఎఫ్ సిటీలోని గదిలో దుండగులు ఆమె గొంతు కోశారు. ఈ ఫ్లాట్‌లో ఆమె తన ముగ్గురు మహిళా సహచరులతో కలిసి ఉంటోంది. సిన్సి సెబాస్టియన్ అనే ఆ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రక్తం మడుగులో పడి ఉందని డిప్యూటీ పోలీసు కమిషనర్ (తూర్పు) మహేశ్వర్ దయాళ్ చెప్పారు. రూమ్మేట్స్ బయటకు వెళ్లిన తర్వాత ముగ్గురు, నలుగురు వ్యక్తులు లోనికి ప్రవేశించారని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. గదిలో విలువైన వస్తువులేవీ పోలేదు. దీంతో దొంగతనం కోసం ఈ హత్య జరగలేదని తెలుస్తోంది. హత్యకు కారణాలు తెలియడం లేదు.












Click it and Unblock the Notifications