పాకిస్తాన్ సంక్షోభం: దుబాయ్‌కి అధ్యక్షుడు జర్దారీ

మెమొ వివాదంతో ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య విభేదాలు తలెత్తిన తర్వాత జర్దారీ దుబాయ్‌కి వెళ్లడం ఇది రెండో సారి. నిరుడు డిసెంబర్ 6వ తేదీన దుబాయ్ వెళ్లిన ఆయన పక్షం రోజుల పాటు అక్కడే ఉండి, హృదయ సంబంధమైన సమస్యకు చికిత్స తీసుకున్నారు. పదవి నుంచి దిగిపోవాలని జర్దారీపై సైన్యం నుంచి ఒత్తిడి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దానివల్లనే ఆయన దుబాయ్ పర్యటన పెట్టుకున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తాను పదవి నుంచి తప్పుకునే సమస్య లేదని జర్దారీ ఇప్పటికే స్పష్టం చేశారు.
నిరుడు మేలో అమెరికా ఒసామా బిన్ లాడెన్‌ను చంపిన తర్వాత సైన్యం కుట్రను ఎదుర్కోవడానికి సహాయం చేయాలని అమెరికాను కోరిన మెమో గురించి పాకిస్తానీ అమెరికన్ వ్యాపారవేత్త మన్సూర్ ఇజాజ్ బహిరంగంగా చెప్పడంతో వివాదం ప్రారంభమైంది. అది ఓ కాగితం ముక్క మాత్రమేనని పాకిస్తాన్ ప్రభుత్వం కొట్టి పారేయడానికి ప్రయత్నించింది. ఈ కుంభకోణంపై దర్యాప్తునకు ఆదేశించాలని ఆర్మీ, ఐఎఎస్ఐ చీఫ్‌లు సుప్రీంకోర్టును కోరారు.
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications