జగన్ వర్గ ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు

కొండా మురళి పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ భర్త. వీరిద్దరు కూడా మొదటి నుంచీ వైయస్ జగన్‌కు మద్దతు ప్రకటించడమే కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. పుల్లా పద్మావతి మాత్రం వైయస్ జగన్‌పై అలిగినట్లు వార్తలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో వైయస్ జగన్ చేపట్టిన రైతు దీక్షకు ఆమె హాజరు కాలేదు. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఉద్దేశంతో ఆమె జగన్‌కు దూరమైనట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన తమ పార్టీ శాసనసభ్యులపై కాంగ్రెసు పార్టీ ఇప్పటికే స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మరో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావుపై మాత్రం ఫిర్యాదు చేయలేదు. ఆయనపై ఏ విధంగా ఫిర్యాదు చేయాలనే విషయంపై కాంగ్రెసు పార్టీలో చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications