వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేతలు ఏ ప్రాంతంలోనైనా స్వేచ్ఛగా తిరుగొచ్చు: డిజిపి

By Pratap
|
Google Oneindia TeluguNews

DGP Dinesh Reddy
హైదరాబాద్: రాజకీయ నాయకులు ఏ ప్రాంతంలోనైనా స్వేచ్ఛంగా తిరగవచ్చునని, వారికి భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలిచ్చామని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) దినేష్ రెడ్డి అన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. ఆంధ్ర, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు పెరిగాయని, మావోయిస్టులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. పోలీసు శాఖ ఆధుకనీకరణకు 3 వేల కోట్ల రూపాయల ప్రతిపాదన చేసినట్లు ఆయన తెలిపారు.

హోంగార్డుల నియామకానికి మార్గదర్శక సూత్రాలను రూపొందించామని, హోం గార్డుల నియామకాల్లో అక్రమాలను కట్టడి చేస్తామని ఆయన చెప్పారు. లాకప్ డెత్‌లను అరికట్టడానికి కేంద్రం ఓ చట్టం తెస్తోందని, పార్లమెంటులో అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతుందని, లాకప్ డెత్‌ల కట్టడికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ కమిటీ కూడా ఏర్పాటవుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ విద్యార్థి యాకూబ్ రెడ్డిపై పోలీసులు దాడి చేశారనే ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేస్తుందని ఆయన చెప్పారు.

English summary
DGP Dinesh Reddy said that political leaders can freely moove in any area, they will be provided security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X