ఐదేళ్లలో ఐదుగురు సిఎంలు వస్తారు: గాలి

ప్రచారం కోసం, సొంత పరపతిని పెంచుకోవడానికే ముఖ్యమంత్రి హైదరాబాదులో భాగస్వామ్య సదస్సును నిర్వహించారని ఆయన అన్నారు. పాత కంపెనీలనే కొత్తగా చూపారు తప్ప ఒక్క పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌ను ఆంధ్రప్రదేశ్ మాదిరిగా మారుస్తానని కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ చెబుతున్నారని, అవినీతిని పెద్ద యెత్తున పెంచడమే రాహుల్ మాటల్లోని ఆంతర్యమా అని ఆయన అన్నారు. సామాన్యుడికి ధరలు అందుబాటులో లేకపోవడంతో పాటు తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండుగను కూడా జరుపుకోలేని దుస్థితిలో ఉన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications