వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి ఢిల్లీకి వద్దు: కడప నాయకుల కొత్త కొలికి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ: మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవద్దని, ఆయన సేవలను రాష్ట్రంలోనే వినియోగించుకోవాలని కడప జిల్లాకు చెందిన కాంగ్రెసు నాయుకులు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు సూచించారు. మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, అహ్మదుల్లా, శాసనసభ్యుడు వీరశివా రెడ్డి, ఎమ్మెల్సీ చెంగల్రాయుడు ఈ మేరకు ఓ నోట్ సమర్పించారు. చిరంజీవి తిరుపతి నియోజకవర్గాన్ని ఖాళీ చేస్తే అక్కడ పార్టీ తిరిగి విజయం సాధించడం కష్టమని స్పష్టం చేశారు. చిరంజీవి వర్గానికి చెందిన ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యను రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకొనే దిశగా ఇప్పటికే నిర్ణయం తీసుకుంటే దాన్ని విరమించుకోవాలని ఆజాద్‌కు సూచించారు. రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటే చిరంజీవి సేవలను పార్టీకి వాడుకోవడానికి వీలవుతుందని వారు చెప్పినట్లు సమాచారం.

రామచంద్రయ్యను కేబినెట్‌లోకి తీసుకుంటే కడప జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి పెచ్చరిల్లుతుందని చెప్పారు. ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇస్తే ఎమ్మెల్సీలుగా ఉన్న సీనియర్ నేతలు కూడా తమకూ అవకాశాలు కావాలని కోరుకుంటారని, వారంతా ఢిల్లీ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా ఆజాద్‌కు వీరు చెప్పినట్లు తెలిసింది. అంతా ఒకే వర్గానికి చెందిన వారిని మంత్రి పదవుల్లో నియమిస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని తెలిపారు. చిరంజీవిని కేంద్ర మంత్రివర్గంలోకి, రామచంద్రయ్యను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవద్దని అభ్యర్థిస్తూ అందుకు కారణాలను వివరిస్తూ వారు ఆజాద్‌కు నోట్ సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా మంత్రి మాణిక్యవరప్రసాద్, పీసీసీ కార్యదర్శి వినోద్ రెడ్డి కూడా ఆజాద్‌ను కలుసుకుని రాష్ట్రంలో పరిపాలన గాడిలో పడుతోందని, కిరణ్ పాలనలో పరిస్థితులు చక్కబడుతున్నాయని చెప్పారు.

English summary
Kadap Congress leaders suggested party AP affairs incharge Ghulam Nabi Azad to accomidate Chiranjeevi in State government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X