జగన్ కేసు: సిబిఐకోసం విజయ సాయి ఎదురు చూపు!

vijaya sai reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అరెస్టైన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి శనివారం సిబిఐ అధికారుల కోసం నిరీక్షించారట. చంచల్ గూడ జైలులో ఉన్న విజయ సాయి రెడ్డిని విచారణ కోసం సిబిఐ అధికారులు ఉదయం తొమ్మిది గంటలకే వచ్చి తీసుకు వెళ్తుంటారు. అయితే శనివారం మాత్రం సిబిఐ అధికారులు సుమారు గంట ఆలస్యంగా వచ్చారట. తొమ్మిది గంటలకే రావాల్సిన వారు గం.9.50 నిమిషాలకు వచ్చి, అన్ని లాంఛనాలు పూర్తి చేసుకొని గం.10.10 నిమిషాలకు విజయ సాయిని తీసుకు వెళ్లారట. ఉదయమే నిద్రలేచి తొమ్మిది గంటల కల్లా రెడీ ఆయి ఉన్న విజయ సాయి వారి రాక ఆలస్యం కావడంతో వారి కోసం నిరీక్షించారట.

కాగా జైళ్లో ఉన్న ఆయన రోజూ ఉదయం దాదాపు 6 గంటల సమయంలో నిద్ర లేస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకుని ఏడున్నర, ఎనిమిదింటి వరకూ షటిల్ ఆడడం ఆ తర్వాత స్నానం ముగించుకుని జైల్లో ఉన్న దేవాలయంలో పూజ చేయడం మధ్యలో అల్పాహారం తీసుకుంటారు. ఆ తర్వాత తొమ్మిది గంటలకల్లా సిద్ధమవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+